🏠 samajahitham.com
Watermark
Clip Header Logo
Date of Publish : 21 September 2026, 10:22 pm Posted by : SAMAJA HITHAM

ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

News Image
- ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

- ప్రజావాణికి 57 ఫిర్యాదులు

జగిత్యాల, సెప్టెంబర్ 21 (సమాజహితం జిల్లా ప్రతినిధి) : ప్రజావాణి ద్వారా ప్రజల నుండి అందుతున్న ఫిర్యాదులు, వినతులపై సమగ్ర విచారణ జరిపి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంతో పాటు వివిధ మండలాల నుండి ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమానికి వస్తున్నారని తెలిపారు. ప్రజల నుండి అందుతున్న ప్రతి ఫిర్యాదును అధికారులు బాధ్యతాయుతంగా తీసుకుని, సంబంధిత సమస్యపై సమగ్ర విచారణ జరిపి సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజావాణి ద్వారా అందిన అర్జీలను పెండింగ్ లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి, నిర్ణీత సమయంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం లేకుండా ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కాగా ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 57 ఫిర్యాదులు, వినతులు అందాయని, వాటిని సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి తగిన చర్యలు తీసుకుని పరిష్కరించాలని సూచించారు. ప్రజావాణి ద్వారా అందిన ప్రతి దరఖాస్తును అధికారులు ప్రాధాన్యతతో పరిశీలించి, సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టడంతో పాటు దరఖాస్తుదారులకు తగిన సమాచారం అందించాలని పేర్కొన్నారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు సకాలంలో అందే విధంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) బిఎస్ లత, అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) బి. రాజ గౌడ్, డీఆర్వో కె. వై ప్రసాద్, జిల్లా అధికారులు, వివిధ శాఖల అధికారులు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home