🏠 samajahitham.com
Watermark
Clip Header Logo
Date of Publish : 21 September 2026, 10:25 pm Posted by : SAMAJA HITHAM

ఎస్ఐఆర్ లో అనామలీస్, నో మ్యాపింగ్ ఓటర్లకు నోటీసులు అందించి పకడ్బందీగా విచారణ చేపట్టాలి

News Image
- ఎస్ఐఆర్ లో అనామలీస్, నో మ్యాపింగ్ ఓటర్లకు నోటీసులు అందించి పకడ్బందీగా విచారణ చేపట్టాలి : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి

జగిత్యాల, సెప్టెంబర్ 21 (సమాజహితం జిల్లా ప్రతినిధి) : ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో అనామలీస్, నో మ్యాపింగ్ కేటగిరీలో గుర్తించిన ప్రతి ఓటరుకు నోటీసులు అందించి, వారితో పకడ్బందీగా విచారణ నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి ఎస్ఐఆర్ ప్రక్రియ పురోగతిపై అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనామలీస్, నో మ్యాపింగ్ ఓటర్లకు నోటీసుల జారీ, పంపిణీ, విచారణ ప్రక్రియపై జిల్లాల వారీగా సమీక్షించారు. జగిత్యాల సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మరియు అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బిఎస్ లత పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. ఫారమ్ 6, 7 మరియు 8ల పరిష్కారాన్ని చివరి నిమిషం వరకు వాయిదా వేయకుండా తొందరగా పరిష్కరించాలని ఆదేశించారు. అక్టోబర్ 25 లోపు అన్ని పనులు పూర్తి చేసుకోవాలని ఆఖరి 10 రోజులు చివరి క్షణం సవరణల కొరకు కేటాయించాలని కోరారు. ఫారమ్ 6 తో డిక్లరేషన్ ఫారం తప్పకుండా ఇవ్వడం తప్పనిసరి అని మరియు నోటీసులు బీఎల్ఓ లు మాత్రమే పంపిణీ చేయాలని, బీఎల్ఏ లను పంపిణీలో పాల్గొననివ్వద్దని ఆదేశించారు. వయోవృద్ధులకు, అంగ వైకల్యం కలవారు మరియు విదేశాల్లో ఉన్న వారి తరపున వారి కుటుంబ సభ్యులు హియరింగ్ కు హాజరయ్యి సంబంధిత డాక్యుమెంట్స్ ఇవ్వగలరని తెలియజేశారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ.. జిల్లాలో పెండింగ్ లో ఉన్న ఫారం-6, ఫారం-7, ఫారం-8 దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఎస్ఐఆర్-2026 ప్రక్రియలో నిర్దేశించిన లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. బీఎల్ఓ స్థాయిలో ఐదు రోజులకు మించి పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను ప్రత్యేకంగా పరిశీలించి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. నోటీసుల జారీ, విచారణ, దరఖాస్తుల పరిష్కారం వంటి ప్రతి ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించాలని తెలిపారు. అక్టోబర్ 25 గడువును దృష్టిలో ఉంచుకుని ముందస్తు కార్యాచరణతో పనిచేయాలని, చివరి దశలో పనులు పేరుకుపోకుండా ప్రతిరోజూ పురోగతిని సమీక్షించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ రెవెన్యూ బిఎస్ లత, ఆర్డీవో లు, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత అధికారులు, ఎన్నికల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
🏠 Home