🏠 samajahitham.com
Watermark
Clip Header Logo
Date of Publish : 22 September 2026, 7:40 pm Posted by : SAMAJA HITHAM

MBBS సీటు సాధించిన రతికకు ఘన సన్మానం!

News Image
జగిత్యాల, సెప్టెంబర్ 22 (సమాజహితం): ఇబ్రహీంపట్నం మండలంలోని వేములకుర్తి గ్రామానికి చెందిన భోనగిరి రాజేందర్, రజిత దంపతుల కుమార్తె రతిక నల్గొండ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో MBBS సీటు సాధించారు. ఈ సందర్భంగా రతికను మిచ్చమ్మ ఫౌండేషన్ చైర్‌పర్సన్, మాజీ జడ్పీటీసీ జంగిలి సునీత దేవి వెంకట్ అభినందించి ఘనంగా సన్మానించారు. MBBS సీటు సాధించడం పట్ల ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. రతిక పట్టుదలతో చదివి వైద్య విద్యలో సీటు సాధించడం వేములకుర్తి గ్రామానికి, ఆమె తల్లిదండ్రులకు గర్వకారణమని సునీత దేవి వెంకట్ పేర్కొన్నారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదిగి సమాజానికి సేవ చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొని రతికకు అభినందనలు తెలిపారు.
🏠 Home