🏠 samajahitham.com
Watermark
Clip Header Logo
Date of Publish : 24 September 2026, 2:47 pm Posted by : SAMAJA HITHAM

తెలంగాణలో రేషన్ కార్డుల మంజూరు నిరంతర ప్రక్రియ!

News Image
జగిత్యాల జిల్లా, సెప్టెంబర్ 24 (సమాజహితం) తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వంలో సిఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ విజయవంతంగా కొనసాగుతుందని పెగడపల్లి ఏఎంసీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్ పేర్కొన్నారు. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా గురువారం జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలోని ఆరవెల్లి గ్రామంలో స్థానిక సర్పంచ్ ఉప్పులంచ భవాని - లక్ష్మణ్ తో కలిసి స్మార్ట్ రేషన్ కార్డులను మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ రాములు గౌడ్ మాట్లాడుతూ.. అర్హులైన పేదలకు నిరంతరం రేషన్ కార్డులను మంజూరు చేస్తూ, పేద వర్గాల అభివృద్ధికి తెలంగాణ ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు.

భారత దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో మాత్రమే పేదలకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ప్రజా ప్రభుత్వమని, పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత కరెంట్, మహిళలకు, ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ పేదలకు అండగా నిలుస్తున్న ప్రభుత్వమని అన్నారు. దసరా పండుగ లోపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలను గుర్తించి రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు మంజూరు చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కడారి తిరుపతి, మండల నాయకులు చెట్ల కిషన్, ఆర్ఐ జమున, పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్, జిపిఓ గంగయ్య, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు పన్నాటి నవీన్, రాయమల్లు, నరసయ్య, రాయనర్సు, కట్ల మల్లేశం, లబ్ధిదారులు పాల్గొన్నారు.
🏠 Home