🏠 samajahitham.com
Watermark
Clip Header Logo
Date of Publish : 24 September 2026, 4:07 pm Posted by : SAMAJA HITHAM

జగిత్యాల ప్రెస్‌క్లబ్‌లో యశోద ఆసుపత్రి విలేకరుల సమావేశం

News Image
జగిత్యాల జిల్లా, సెప్టెంబర్ 23 (సమాజహితం):: జగిత్యాల పట్టణ ప్రెస్‌క్లబ్‌లో యశోద ఆసుపత్రి, హైటెక్ సిటీ బ్రాంచ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ప్రతినిధులు అందిస్తున్న ఆధునిక వైద్య సేవలు, సాంకేతిక సదుపాయాల గురించి వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆదిత్య సోమయాజు మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో యశోద ఆసుపత్రి అనతికాలంలోనే విస్తృత వైద్య సేవలను అందించే సంస్థగా ఎదిగిందన్నారు. హైదరాబాద్‌లో మలక్‌పేట్, సోమాజిగూడ, సికింద్రాబాద్ ప్రాంతాల్లో ఆసుపత్రి శాఖలను ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. సుమారు నాలుగేళ్ల క్రితం హైటెక్ సిటీలో యశోద ఆసుపత్రి కొత్త బ్రాంచ్‌ను ప్రారంభించినట్లు డాక్టర్ ఆదిత్య సోమయాజు తెలిపారు. ఈ ఆసుపత్రిలో అత్యాధునిక వైద్య సాంకేతికత, ఆధునిక ఇంప్లాంట్లు, 3డీ ప్రింటింగ్ టెక్నాలజీతో పాటు వివిధ రకాల అధునాతన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ముఖ్యంగా ఆర్థోపెడిక్, ఫుట్ అండ్ యాంకిల్ సమస్యలకు ఆధునిక వైద్య విధానాలతో చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. క్రీడాకారుల్లో కనిపించే యాంకిల్ జాయింట్ సమస్యలు, ఎముకలు విరగడం, పాదాల సమస్యలు, ఎముకల లోపాలు, మడమ నొప్పి వంటి సమస్యలకు తగిన చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

అలాగే సరైన పాదరక్షలు ధరించకపోవడం వల్ల వచ్చే పాదాల నొప్పులు, మధుమేహ రోగుల్లో నిర్లక్ష్యం కారణంగా తలెత్తే పాద సమస్యలను ప్రారంభ దశలో గుర్తించి చికిత్స చేయడం ద్వారా అనేక సమస్యలను నివారించవచ్చని సూచించారు. అవసరమైన వారికి ఆధునిక ఫిజియోథెరపీ, పునరావాస చికిత్సను కూడా అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు ఆసుపత్రిలో దాదాపు 400 రోబోటిక్ సర్జరీలు నిర్వహించినట్లు డాక్టర్ ఆదిత్య సోమయాజు వెల్లడించారు. అనేక క్లిష్టమైన కేసులకు విజయవంతంగా చికిత్స అందించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఉద్యోగుల హెల్త్ ఇన్సూరెన్స్ పరిధిలోని వారికి ఆసుపత్రి సేవలు వర్తిస్తున్నాయని, త్వరలో రెవెన్యూ శాఖకు సంబంధించిన ఆరోగ్య బీమా పథకాలను కూడా ఆసుపత్రి పరిధిలోకి తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నట్లు డాక్టర్ ఆదిత్య సోమయాజు తెలిపారు. విలేకరుల సమావేశంలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
🏠 Home