చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: కొమిరెడ్డి కరంచంద్

జగిత్యాల జిల్లా: పేద కుటుంబం నుంచి వచ్చిన చాకలి ఐలమ్మ రైతాంగ హక్కుల కోసం పోరాడిన సంఘటిత ప్రజా నాయకురాలని టీపీసీసీ సీనియర్ నాయకులు సుప్రీంకోర్టు అడ్వకేట్ కొమిరెడ్డి కరంచంద్ కొనియాడారు ఆమె 41 వ జయంతి సందర్భంగా శనివారం మెట్ పల్లి పాత బస్టాండ్ లో కొమిరెడ్డి కరంచంద్, విజయ్ ఆజాద్ లు.. రజక సంఘ ప్రముఖులతోపాటు పలు సామాజిక వర్గ నాయకులతో కలసి ఐలమ్మ విగ్రహానికి పూలదండలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కరంచంద్ మాట్లాడుతూ. ఐలమ్మ ఉమ్మడి రాష్ట్ర వరంగల్ జిల్లా ఎలకతుర్తి మండలం నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన వారని, అప్పటి జమిందారి వ్యవస్థ లో రైతులు గ్రామాల్లో ఎన్నో బాధలు అనుభవించే వారని, ఐలమ్మ ఈ పరిస్థితిని ఎదుర్కొని రైతుల పక్షాన నిలిచి పోరాడారని గుర్తు చేశారు. ఆమె తెలంగాణ సాయుధ రైతంగ పోరాటంలో భాగమై భూస్వాముల అక్రమ హక్కులను వ్యతిరేకించారని, భూమిపై హక్కుల కోసం, సామాజిక న్యాయం కోసం, సమానత్వం కోసం పోరాడిన తొలి మహిళ ఉద్యమ నేతలలో ఆమె ఒకరని అభివర్ణించారు. నక్సలైట్ ఉద్యమానికి ముందుగానే భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు చేసి బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి బాటలు వేశారని కరంచంద్ కీర్తించారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు వంతడుపుల లక్ష్మణ్, కలికోట వేణు,డాక్టర్ లక్ష్మణ్,న్యాయవాది సురభి అశోక్ లతోపాటు పలు కుల సంఘాల ప్రముఖులు, పాల్గొన్నారు