దళితుల సమస్యల పరిష్కారానికి సహకరించాలి
దళితుల సమస్యలపై సానుకూలంగా స్పందించాలి: ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు మల్కి ప్రవీణ్ మాదిగ
షాబాద్, సెప్టెంబర్ 28 (సమాజహితం): ఎమ్మార్పీఎస్ షాబాద్ నూతన మండల కమిటీ ఆధ్వర్యంలో షాబాద్ మండల రెవెన్యూ, అభివృద్ధి శాఖ అధికారులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో, ఎంపీడీవోలను శాలువాలతో సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు మల్కి ప్రవీణ్ మాదిగ మాట్లాడుతూ.. దళితులు ఎదుర్కొంటున్న భూ సమస్యలు, విరాసత్ సమస్యలు, భూ రికార్డుల్లో తప్పిదాలు, ఇతర రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారంలో అధికారులు సానుకూలంగా స్పందించాలని కోరారు. సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాలకు వచ్చే దళితులకు తగిన సహకారం అందించి, వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే షాబాద్ ఎంపీడీవోతో మాట్లాడుతూ.. ఎస్సీ కార్పొరేషన్ రుణాలు, ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు, ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించే వివిధ రుణాలు, సంక్షేమ పథకాల విషయంలో అర్హులైన దళితులకు సమాన అవకాశాలు కల్పించాలని కోరారు. ఎలాంటి తారతమ్యాలకు తావులేకుండా అందరినీ సమానంగా పరిగణించి, దళితులు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందేందుకు అధికారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ పారదర్శకంగా అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ నూతన మండల కమిటీ కోరింది. దళితుల సమస్యలను అధికారులు తమ దృష్టికి తీసుకువచ్చినప్పుడు వాటిని పరిశీలించి పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల ఉపాధ్యక్షులు ప్రవీణ్ మాదిగ, మండల అధికార ప్రతినిధి రమేష్ మాదిగ, మండల ప్రధాన కార్యదర్శి వినోద్ మాదిగ, మండల కార్యదర్శి రవీందర్ మాదిగ, మండల సహాయ కార్యదర్శి శేఖర్ మాదిగ, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.