గాంధీ, శాస్త్రి బాటలో నడుద్దాం: బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఏలేటి రాంరెడ్డి!
మెట్‌పల్లి, జగిత్యాల జిల్లా (సమాజహితం న్యూస్): జాతిపిత మహాత్మా గాంధీ, భారతరత్న లాల్ బహదూర్ శాస్త్రి చూపిన బాటలో నడుద్దామని మెట్‌పల్లి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఏలేటి రాంరెడ్డి అన్నారు. శుక్రవారం వారి జయంతి సందర్భంగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. అనంతరం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ.. ఈనాడు మనం స్వేచ్ఛా, స్వాతంత్ర్యంతో జీవిస్తున్నామంటే ఆనాడు మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి చేసిన త్యాగమే కారణమని తెలిపారు. ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు శాస్త్రి అందించిన సంస్కరణలు దేశానికి ఎంతో ఉపయోగపడ్డాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నల్ల రాజేందర్, కార్యవర్గ సభ్యులు పోలకొండ దయాకర్ వర్మ, ద్యావని సత్యనారాయణ మరియు బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.