🏠 samajahitham.com
Watermark
Clip Header Logo
Date of Publish : 05 October 2026, 11:34 pm Posted by : SAMAJA HITHAM

గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

News Image
జగిత్యాల, అక్టోబర్ 05 ( సమాజహితం న్యూస్ ) : ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డేలో భాగంగా సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 8 మంది అర్జీదారులతో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ నేరుగా మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ అధికారులను ఆదేశించారు. బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని, ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడం లక్ష్యంగా ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి, వినతులు స్వీకరించి, సంబంధిత ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పరిశీలించి, వేగంగా స్పందించి, బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడడం జరుగుతోందని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు.
🏠 Home