మెట్ పల్లి మండల కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా సోన్నాయిల శేఖర్!
జగిత్యాల జిల్లా, అక్టోబర్ 13 ( సమాజహితం న్యూస్ ) : కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి, వెలమ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నర్సింగరావు ఆదేశాల మేరకు మెట్ పల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జంగిటి రాజేందర్ అధ్యక్షతన మెట్ పల్లి మండల కాంగ్రెస్ పార్టీ నూతన జనరల్ సెక్రటరి గా సోన్నాయిల శేఖర్ ను నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోరుట్ల నియోజకవర్గ మాజీ సర్పంచ్ ల సంక్షేమ సంఘం అధ్యక్షులు ద్యావతి జంగా గంగా స్వామి, మాజీ సింగిల్ విండో చైర్మన్ సుతారి శంకర్, మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముత్తయ్య, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈసందర్బంగా నూతన జనరల్ సెక్రటరీ సోన్నాయిల శేఖర్ మాట్లాడుతూ నాపై నమ్మకం తో పార్టీ ఇంచార్జి నర్సింగరావు తనకు అప్పగించిన పనిని సక్రమంగా నిర్వహిస్తు మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలిపారు. నా నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదములు తెలిపారు.