🏠 samajahitham.com
Watermark
Clip Header Logo
Date of Publish : 13 October 2026, 11:08 pm Posted by : SAMAJA HITHAM

స్వర్ణకారుల షాపుల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి

News Image
జగిత్యాల జిల్లా, అక్టోబర్ 13 ( సమాజహితం న్యూస్ ) : స్వర్ణకారులు, బంగారు ఆభరణాల వ్యాపారులు తమ షాపుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని మెట్ పల్లి సీఐ సూచించారు. బంగారు ఆభరణాల దుకాణాల్లో చోరీలు, ఇతర అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. షాపుల వద్ద అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేసుకోవడంతో పాటు సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

దుకాణాల్లో నాణ్యమైన సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, అవి నిరంతరం పనిచేసేలా చూసుకోవాలని పేర్కొన్నారు. షాపులను మూసివేసే సమయంలో బంగారు ఆభరణాలను సురక్షితమైన లాకర్లలో భద్రపరచాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నగదు, విలువైన ఆభరణాలను తరలించే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.

వ్యాపారులు పోలీసులకు సహకరిస్తూ భద్రతా చర్యలను పటిష్టం చేసుకోవాలని సీఐ సూచించారు. ఏదైనా అనుమానాస్పద ఘటన జరిగినా, అనుమానిత వ్యక్తులు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించడంలో పోలీసులకు సహకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇరు వ్యాపార సంఘ అధ్యక్ష కార్యవర్గ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
🏠 Home