కొండ్రికర్ల బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించిన జువ్వాడి నర్సింగరావు

జగిత్యాల, సెప్టెంబర్ 04 (సమాజహితం) : కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, వెలమ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నర్సింగరావు కొండ్రికర్ల గ్రామంలో రూ.6 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులను ఈరోజు సందర్శించి పరిశీలించారు. దాదాపు 30 సంవత్సరాలుగా గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు ఈ బ్రిడ్జి నిర్మాణంతో పరిష్కారం లభించనుందని ఈ సందర్భంగా గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో సర్పంచ్, ఉపసర్పంచ్‌తో పాటు వివిధ కుల సంఘాలు, మహిళా సంఘాల ప్రతినిధులు, గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జువ్వాడి నర్సింగరావు మాట్లాడుతూ, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడమే...