పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ నాయకుల వంటావార్పు కార్యక్రమం!

పెద్దపల్లి జిల్లా, సెప్టెంబర్ 04 (సమాజహితం) : అసెంబ్లీలో ప్రతిపక్ష నేతలైన కేటీఆర్ హరీష్ రావులు అడిగే ప్రశ్నలకు దమ్ము ధైర్యం లేక మొహం చాటేస్తుంటే ఇక్కడ మంత్రి అడ్డూరి మాత్రం సవాళ్లు విసరడం హాస్యాస్పదంగా ఉందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మంత్రి లక్ష్మణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి కొప్పుల కౌంటర్ ఇచ్చారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన వంట వార్పు కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం పై పలు విమర్శలు చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేసే చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి లేదని ధ్వజమెత్తారు. పెద్దపల్లి జిల్లా...