కోరుట్ల వినాయక నిమజ్జన వాగు వద్ద ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ
జగిత్యాల/ కోరుట్ల, సెప్టెంబర్ 19 (సమాజహితం ప్రతినిధి) : భక్తి శ్రద్ధలతో కోరుట్ల పట్టణంలో ఈ నెల 23, 24 తేదీలలో వినాయక నిమజ్జన వేడుకలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తెలిపారు. కోరుట్ల పట్టణంలోని వాగు వద్ద వినాయక నిమజ్జన వేడుకల కోసం మున్సిపల్, పోలీస్, రెవెన్యూ, అగ్నిమాపక ఇతర శాఖల ఆధ్వర్యంలో చేస్తున్న ఏర్పాట్లను శనివారం జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. వినాయక మండపాల నిర్వాహకులు తమ విగ్రహాలను భక్తి శ్రద్ధల మధ్య వేడుకలు నిర్వహిస్తూ వైభవంగా తరలించాలని సూచించారు. ప్రతి ఒక్క నిర్వాహకులు అధికారులకు...