వినాయక నిమజ్జన ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలి : జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

మెట్ పల్లి వాగు వద్ద ఏర్పాట్లను ఎస్పీతో కలిసి పరిశీలించిన కలెక్టర్ జగిత్యాల/ మెట్ పల్లి, సెప్టెంబర్ 19 (సమాజహితం ప్రతినిధి) : భక్తి శ్రద్ధలతో మెట్ పల్లి పట్టణంలో వినాయక నిమజ్జన వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తెలిపారు. మెట్ పల్లి పట్టణంలోని వాగు వద్ద వినాయక నిమజ్జన వేడుకల కోసం మున్సిపల్, పోలీస్, రెవెన్యూ, అగ్నిమాపక ఇతర శాఖల ఆధ్వర్యంలో చేస్తున్న ఏర్పాట్లను శనివారం జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. వినాయక మండపాల నిర్వాహకులు తమ విగ్రహాలను భక్తి శ్రద్ధల మధ్య...