కోరుట్ల పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

జగిత్యాల/ కోరుట్ల, సెప్టెంబర్ 19 (సమాజహితం ప్రతినిధి) : జిల్లాలోని పోలీస్ స్టేషన్ల పనితీరు, నేరాల దర్యాప్తు పురోగతి, ప్రజలకు అందిస్తున్న సేవలను పరిశీలించే క్రమంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ శనివారం కోరుట్ల పట్టణంలోని పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిధిలో నమోదైన కేసుల వివరాలు, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతి, స్టేషన్ రికార్డుల నిర్వహణ, బీట్ వ్యవస్థ అమలు, రౌడీషీటర్లు మరియు నేరస్తులపై నిఘా అంశాలను సమీక్షించారు. స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, ప్రజలకు అందిస్తున్న సేవలపై ప్రత్యేకంగా ఆరా తీశారు. ప్రస్తుతం జరుగుతున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పోలీస్ అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా విధులు...