జాతీయ మెగా లోక్ అదాలత్ విజయానికి కృషి చేసిన అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేత
జగిత్యాల, సెప్టెంబర్ 19 (సమాజహితం ప్రతినిధి) : న్యాయవ్యవస్థను ప్రజలకు మరింత సులభంగా, వేగవంతంగా మరియు పారదర్శకంగా అందించాలంటే కోర్టులు మరియు పోలీస్ శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి అన్నారు. ఈ దిశగా జిల్లా కోర్టు ప్రాంగణంలో జిల్లా కోర్టు కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించబడింది. ఈ సందర్భంగా జిల్లాలో తేదీ 12.09.2026 శనివారం నాడు నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్ ను విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన న్యాయ శాఖ, పోలీస్ అధికారులు, సిబ్బంది మరియు బార్ అసోసియేషన్ సభ్యులను జిల్లా జడ్జి రత్న పద్మావతి అభినందిస్తూ, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ...