గణేష్ నిమజ్జన ట్రాఫిక్ నియంత్రణలో ట్రాన్స్ జెండర్ల భాగస్వామ్యం - జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల, సెప్టెంబర్ 21 (సమాజహితం ప్రతినిధి) : గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని జగిత్యాల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిమజ్జనోత్సవ బందోబస్తులో ట్రాన్స్ జెండర్లను భాగస్వామ్యం చేస్తూ ట్రాఫిక్ నియంత్రణ విధులు నిర్వహించే అవకాశం కల్పిస్తున్నట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ట్రాన్స్ జెండర్లతో సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ, గణేష్ నిమజ్జనోత్సవ బందోబస్తులో ట్రాఫిక్ నియంత్రణ విధులు నిర్వహించనున్న 17 మంది ట్రాన్స్ జెండర్లకు టీషర్ట్ లను అందజేశారు. అనంతరం వారికి విధుల నిర్వహణకు సంబంధించిన సూచనలు, మార్గదర్శకాలను అందించారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు, గణేష్ విగ్రహాలు తరలివచ్చే...