రిమ్స్ అగ్నిప్రమాద ఘటన పై సమగ్ర విచారణ
రిమ్స్ అగ్నిప్రమాద ఘటన పై సమగ్ర విచారణ. ఎలక్ట్రికల్, ఫైర్, సివిల్ స్ట్రక్చర్ సేఫ్టీ ఆడిట్‌లు నిర్వహించాలి. రిమ్స్‌ను 950 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా అభివృద్ధి చేస్తాం. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ. ఆదిలాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) ఆస్పత్రిలోని ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ విభాగంలో సోమవారం రాత్రి జరిగిన అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంగళవారం రిమ్స్ ఆస్పత్రిని సందర్శించిన మంత్రి, అగ్నిప్రమాదం జరిగిన నవజాత శిశు వార్డును పరిశీలించారు. ప్రమాద సమయంలో చేపట్టిన సహాయక చర్యలు, చిన్నారుల ప్రస్తుత వైద్య...