వేదఘోషల నడుమ గణనాథుడి నిమజ్జనం.. మంథనిలో భక్తిశ్రద్ధలతో శోభాయాత్ర!

పెద్దపల్లి, సెప్టెంబర్ 23 (సమాజహితం): పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో గణనాథుని నిమజ్జనం భక్తిశ్రద్ధల మధ్య సాంప్రదాయబద్ధంగా జరిగింది. డీజేలు, నృత్యాలకు భిన్నంగా వేద మంత్రోచ్ఛారణలు, వేద ఘోషల నడుమ వినాయకుడి శోభాయాత్ర నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మంథని పట్టణంలో, గ్రామ గ్రామాన వినాయక నవరాత్రి ఉత్సవాలను భక్తులు అత్యంత వైభవంగా నిర్వహించారు. తొమ్మిది రోజుల పాటు మండపాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, భజనలు, సంకీర్తనలు, సామూహిక అన్నదాన కార్యక్రమాలతో గణనాథునికి భక్తులు ఘనంగా సేవలందించారు.మంగళవారం ఏకాదశి సందర్భంగా మహిళా భక్తులు ఏకరూప దుస్తులు ధరించి, ఇళ్ల నుంచి ప్రత్యేకంగా మంగళహారతులు తీసుకువచ్చారు. అనంతరం లంబోదరునికి సామూహికంగా నీరాజనాలు సమర్పించారు.పట్టణంలోని శ్రీ...