తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నేటితో ముగింపు

- తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నేటితో ముగింపు - తిరుమలలో ఘనంగా కొనసాగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు - నేడు బ్రహ్మోత్సవాల్లో అత్యంత పవిత్రమైన చక్రస్నానం - గోవింద నామస్మరణతో మార్మోగుతున్న తిరుమల కొండలు తిరుమల, సెప్టెంబర్ 23 (సమాజహితం): తిరుమలలో అత్యంత వైభవంగా కొనసాగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నేటితో ముగియనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో అత్యంత పవిత్రమైన ఘట్టంగా భావించే చక్రస్నానం నేడు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. వరాహస్వామి పుష్కరిణిలో శ్రీమలయప్ప స్వామి, శ్రీదేవి, భూదేవి సమేతంగా సుదర్శన చక్రాన్ని ఊరేగింపుగా తీసుకువచ్చి పవిత్ర స్నానం నిర్వహించనున్నారు. అనంతరం సుదర్శన చక్రానికి శాస్త్రోక్తంగా అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేపట్టనున్నారు. చక్రస్నానం అనంతరం భక్తులు కూడా వరాహస్వామి...