వర్షానికి పాఠశాల గోడపై కూలిన భారీ చెట్టు

విశాఖ జిల్లా, సెప్టెంబర్ 23 (సమాజహితం): భారీ వర్షాల కారణంగా విశాఖ జిల్లా పద్మనాభం మండలం చిన్నాపురం గ్రామంలో పాఠశాల గోడపై భారీ చెట్టు కూలిపోయింది. వర్షాలకు చెట్టు వేళ్లు బలహీనపడటంతో ఒక్కసారిగా చెట్టు విరిగి పాఠశాల గోడపై పడినట్లు స్థానికులు తెలిపారు. చెట్టు కూలడంతో పాఠశాల గోడ కొంతమేర దెబ్బతిన్నట్లు సమాచారం. అయితే ఘటన సమయంలో పాఠశాలకు సెలవు ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు పాఠశాలలో లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. భారీ వర్షాల నేపథ్యంలో గ్రామాల్లో బలహీనంగా ఉన్న చెట్లను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.