శ్రీకాకుళం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం..నలుగురు మృతి!
శ్రీకాకుళం జిల్లా, సెప్టెంబర్ 23 (సమాజహితం): టెక్కలి మండలం రావివలస సమీపంలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రైల్వే ట్రాక్‌పై వెళ్తున్న ఐదుగురిని రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, రైల్వే అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను పరిశీలించిన అధికారులు మృతుల పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. రైల్వే ట్రాక్‌పైకి వెళ్లే సమయంలో రైలు రావడాన్ని గమనించకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే...