నాగులమల్యాలలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేత!

కరీంనగర్, సెప్టెంబర్ 24 (సమాజహితం): కరీంనగర్ నియోజకవర్గం కొత్తపల్లి మండలం నాగులమల్యాల గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు గుర్తూరి గంగాజమున – వీరాస్వామి, మ్యాక తిరుపతి కుటుంబాలకు సీనియర్ కాంగ్రెస్ నాయకులు మల్యాల రాజా గౌడ్ ప్రొసీడింగ్స్ అందజేశారు. అనంతరం భూమిపూజ, శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని కొబ్బరికాయ కొట్టి లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు కాంగ్రెస్ ప్రభుత్వం, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు నాంపల్లి లక్ష్మయ్య, గ్రామ పూజారి పురాణం కళానిధి శర్మ, రజక సంఘం మాజీ అధ్యక్షుడు చట్టు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.