తెలంగాణలో రేషన్ కార్డుల మంజూరు నిరంతర ప్రక్రియ!
జగిత్యాల జిల్లా, సెప్టెంబర్ 24 (సమాజహితం) తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వంలో సిఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ విజయవంతంగా కొనసాగుతుందని పెగడపల్లి ఏఎంసీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్ పేర్కొన్నారు. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా గురువారం జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలోని ఆరవెల్లి గ్రామంలో స్థానిక సర్పంచ్ ఉప్పులంచ భవాని - లక్ష్మణ్ తో కలిసి స్మార్ట్ రేషన్ కార్డులను మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ రాములు గౌడ్ మాట్లాడుతూ.. అర్హులైన పేదలకు నిరంతరం రేషన్ కార్డులను మంజూరు చేస్తూ, పేద వర్గాల...