జగిత్యాల ప్రెస్‌క్లబ్‌లో యశోద ఆసుపత్రి విలేకరుల సమావేశం

జగిత్యాల జిల్లా, సెప్టెంబర్ 23 (సమాజహితం):: జగిత్యాల పట్టణ ప్రెస్‌క్లబ్‌లో యశోద ఆసుపత్రి, హైటెక్ సిటీ బ్రాంచ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ప్రతినిధులు అందిస్తున్న ఆధునిక వైద్య సేవలు, సాంకేతిక సదుపాయాల గురించి వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆదిత్య సోమయాజు మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో యశోద ఆసుపత్రి అనతికాలంలోనే విస్తృత వైద్య సేవలను అందించే సంస్థగా ఎదిగిందన్నారు. హైదరాబాద్‌లో మలక్‌పేట్, సోమాజిగూడ, సికింద్రాబాద్ ప్రాంతాల్లో ఆసుపత్రి శాఖలను ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. సుమారు నాలుగేళ్ల క్రితం హైటెక్ సిటీలో యశోద ఆసుపత్రి కొత్త బ్రాంచ్‌ను ప్రారంభించినట్లు డాక్టర్ ఆదిత్య సోమయాజు తెలిపారు. ఈ ఆసుపత్రిలో...