జర్నలిస్టు జనానికి అంకితం..కుటుంబానికి దూరం..25 ఏళ్ల జర్నలిజం ప్రస్థానం..నేడు ఆసుపత్రి పాలైన సీనియర్ జర్నలిస్టు!
జర్నలిస్టు జనానికి అంకితం..కుటుంబానికి దూరం..25 ఏళ్ల జర్నలిజం ప్రస్థానం..నేడు ఆసుపత్రి పాలైన సీనియర్ జర్నలిస్టు..జనం కోసం కలం పట్టాడు..నేడు కుటుంబం కోసం చేయూత కోరుతున్నాడు..నేడు ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు..! జగిత్యాల జిల్లా: జనం సమస్యలను తన సమస్యలుగా భావిస్తూ.. ప్రజల గొంతుకగా నిలుస్తూ.. గత 25 ఏళ్లుగా జర్నలిజం వృత్తినే నమ్ముకుని ముందుకు సాగుతున్న సీనియర్ జర్నలిస్టు గాజుల నాగరాజు నేడు ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జర్నలిస్టుల కోసం పనిచేస్తూ.. పలు కీలక పదవుల్లో కొనసాగిన నాగరాజు, జగిత్యాల జిల్లా ఏర్పడిన తర్వాత కూడా జిల్లా స్థాయిలో బాధ్యతలు నిర్వహించారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో, ముఖ్యంగా అక్రిడిటేషన్లు, బస్...