జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ ఆధ్వర్యంలో ప్రశాంతంగా ముగిసిన గణేష్ నిమజ్జనోత్సవాలు!

జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ ఆధ్వర్యంలో ప్రశాంతంగా ముగిసిన గణేష్ నిమజ్జనోత్సవాలు! తెలంగాణలో ఎక్కడ లేనివిధంగా ట్రాన్స్‌జెండర్లతో బందోబస్తు నిర్వహణకు ప్రజల ప్రశంసలు! 700 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు.. సీసీ కెమెరాలతో నిరంతర నిఘా: గణేష్ నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా జగిత్యాల జిల్లాలో నిర్వహించిన గణేష్ నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ముగిశాయి. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్ ఆధ్వర్యంలో పోలీస్ శాఖ ముందస్తుగా చేపట్టిన విస్తృత భద్రతా చర్యలు, వివిధ శాఖల సమన్వయంతో నిమజ్జన కార్యక్రమాలు సజావుగా సాగాయి. జిల్లావ్యాప్తంగా సుమారు 700 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి...