భూవివాదంలో ఇద్దరిపై దాడి..నలుగురు నిందితులకు రిమాండ్
- భూవివాదంలో ఇద్దరిపై దాడి..నలుగురు నిందితులకు రిమాండ్. - గొడ్డలి, కర్రలు, రాళ్లతో దాడి.. షాబాద్ పోలీసుల కేసు నమోదు. షాబాద్, సెప్టెంబర్ 28 (సమాజహితం): భూవివాదం నేపథ్యంలో ఇద్దరిపై దాడికి పాల్పడిన నలుగురు నిందితులను షాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షాబాద్ గ్రామ శివారులో ఈ నెల 25న రాత్రి 8 గంటల సమయంలో భూవివాదం నేపథ్యంలో తొంట వెంకటేష్,తొంట చిన్న రాములుపై నర్సిములు, పెద్ద రాములు, అభిషేక్, అఖిల్‌లు గొడ్డలి, కర్రలు, రాళ్లతో దాడి చేసినట్లు కేసు నమోదైంది. ఈ దాడిలో వెంకటేష్ ఎడమ అరచేతికి లోతైన గాయం కాగా, చిన్న రాములుకు ఎడమ...