గాంధీ సిద్ధాంతాలను ఆచరించాలి: జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

జగిత్యాల, అక్టోబర్ 2 (సమాజహితం న్యూస్) : మహాత్మా గాంధీ సిద్ధాంతాలను ఆచరించాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అన్నారు. ప్రపంచానికి అహింస, సత్యాగ్రహ సిద్ధాంతాలను అందించిన మహనీయుడు, జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలను శుక్రవారం కలెక్టరేట్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గాంధీ చిత్రపటానికి పూలు సమర్పించి ఘన నివాళులర్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. గాంధీ సిద్ధాంతాలు, ఆశయాలను అందరూ ఆచరించాలన్నారు. ఆ మహనీయుడు దేశానికి చేసిన సేవలను గుర్తుచేస్తూ, దేశానికి స్వాతంత్ర్యం రావడానికి గాంధీజీ అహింస, శాంతి సిద్ధాంతాలను ఆయుధాలుగా చేసుకుని దేశ ప్రజలను స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొనేలా ఉపన్యాసాలిస్తూ, పాదయాత్రలు చేస్తూ, దేశ స్వాతంత్ర్య...