ఎస్సీ బాలుర, బాలికల వసతి గృహాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

జగిత్యాల/మెట్ పల్లి, అక్టోబర్ 3 (సమాజహితం ప్రతినిధి): ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని, మెట్‌పల్లి పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ శనివారం ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వసతి గృహాల్లో విద్యార్థులకు అందుతున్న వసతి, భోజనం, తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలను పరిశీలించి, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థుల ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ నాణ్యమైన భోజనం, పరిశుభ్రమైన తాగునీరు, సక్రమమైన పారిశుధ్య నిర్వహణ ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి సౌకర్యాలపై వివరాలు అడిగి...