శ్రీసిటీలో పేలిన బాయిలర్
తిరుపతి జిల్లా, అక్టోబర్ 03 ( సమాజహితం న్యూస్ ) : తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గ పరిధిలోని పారిశ్రామిక కేంద్రం శ్రీసిటీలో శనివారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక ‘టిల్ హెల్త్‌కేర్’ (TIL Healthcare) పరిశ్రమలో బాయిలర్ ఒక్కసారిగా పేలిపోవడంతో ఐదుగురు కార్మికులు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి బాయిలర్ యూనిట్ ఉన్న భవనం పూర్తిగా నేలమట్టమైంది. పేలుడు ధాటికి కూలిన భవనం ఉదయం 8 గంటల సమయంలో కార్మికులు విధుల్లో ఉండగా బాయిలర్ భారీ శబ్దంతో పేలిపోయింది. ఆ ధాటికి పైకప్పు ఇనుప రాడ్లు, కాంక్రీట్ శకలాలు ఎగిరిపడ్డాయి. బాయిలర్ వద్ద పనిచేస్తున్న ఇద్దరు సంఘటనా స్థలంలోనే...