జిల్లాలో ఆహార భద్రత ప్రమాణాలు పటిష్టంగా అమలు చేయాలి: జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

జగిత్యాల, అక్టోబర్ 05 (సమాజహితం న్యూస్): జిల్లాలో ఆహార భద్రత ప్రమాణాలను పటిష్టంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అన్నారు. కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, రెసిడెన్షియల్ హాస్టళ్లలో చిన్నారులకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వంటశాలల పరిశుభ్రత, ఆహార పదార్థాల నిల్వ, వంట ప్రక్రియ, తాగునీటి నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని, హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు, స్ట్రీట్ ఫుడ్, మెస్‌లలో ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలను ఖచ్చితంగా పాటించేలా నిరంతరం తనిఖీలు నిర్వహించి, నిబంధనలు...