గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలి: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

జగిత్యాల, అక్టోబర్ 05 (సమాజహితం న్యూస్): గోదావరి పుష్కరాలు–2027ను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని, ధర్మపురి, కోటిలింగాల తదితర పుష్కర ఘాట్ల వద్ద భక్తులకు అవసరమైన అన్ని మౌలిక వసతులు ముందుగానే పూర్తి చేయాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్‌తో కలిసి పుష్కరాలపై సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడుతూ.. భక్తుల రాక భారీగా ఉండే అవకాశం ఉన్నందున రహదారులు, ఘాట్లు, తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్, వైద్య సేవలు, పార్కింగ్, భద్రత తదితర అంశాలపై...