గిరిజన మినీ గురుకులం మోడల్ స్కూల్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్
జగిత్యాల/ మల్లాపూర్, అక్టోబర్ 7 (సమాజహితం ప్రతినిధి): జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని గిరిజన మినీ గురుకులం టీజీ మోడల్ స్కూల్‌ను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ బుధవారం సందర్శించి, విద్యార్థులకు అందుతున్న విద్య వసతి, భోజనం, మౌలిక వసతులను పరిశీలించారు. పాఠశాలలోని తరగతి గదులు విద్యార్థుల హాజరు బోధనా విధానం విద్యార్థుల విద్యా ప్రగతి తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి, వారి విద్యా పరిస్థితులు పాఠశాలలో అందుతున్న సౌకర్యాలు భోజనం తదితర అంశాలపై వివరాలు అడిగి, తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఆరోగ్యకరమైన వాతావరణం మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను...