శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి వెంటనే నీరు విడుదల చేయాలి
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి వెంటనే నీరు విడుదల చేయాలి చివరి ఆయకట్టు రైతులకు సాగునీరు అందించాలని బోయిని హన్మాండ్లు డిమాండ్ మల్లాపూర్, అక్టోబర్ 8: వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి చివరి ఆయకట్టు ప్రాంతాలకు వెంటనే నీటిని విడుదల చేసి రైతుల పంటలను కాపాడాలని బీసీ సెల్ జగిత్యాల జిల్లా జనరల్ సెక్రటరీ బోయిని హన్మాండ్లు ప్రభుత్వాన్ని కోరారు. మల్లాపూర్ మండలంలోని పాత దామరాజుపల్లి, కొత్త దామరాజుపల్లి, వాల్గొండ, సంఘం, శ్రీరాంపూర్, వివిరావుపేట, గొర్రెపల్లి తదితర చివరి ఆయకట్టు గ్రామాల్లో సాగునీటి కొరతతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. వరి పంటలు కీలక దశలో ఉన్న సమయంలో నీరు...