సమాచార హక్కు చట్టం దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలి

జగిత్యాల, అక్టోబర్ 09 ( సమాజహితం న్యూస్ ) : సమాచార హక్కు చట్టం-2005 కింద అందిన దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలని, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని ఉన్నతాధికారులు అధికారులను ఆదేశించారు. శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో సమాచార హక్కు చట్టంపై పౌర సమాచార అధికారులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు. అక్టోబర్ 5 నుంచి 12వ తేదీ వరకు సమాచార హక్కు వారోత్సవాలు-2026 నిర్వహిస్తున్న నేపథ్యంలో, ప్రజలకు సమాచార హక్కు చట్టంపై విస్తృత అవగాహన కల్పించాలని తెలిపారు. జిల్లా, రెవెన్యూ డివిజన్, మండల స్థాయిల్లో సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. సమాచార హక్కు...