దసరాకు ఊళ్లకు వెళ్లేవారు జాగ్రత్తలు తీసుకోండి: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల, అక్టోబర్ 09 ( సమాజహితం న్యూస్ ) : దసరా పండుగ సందర్భంగా చాలామంది తమ స్వగ్రామాలకు, ఇతర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తుంటారని, ఇదే అదనుగా భావించి దొంగలు ఇళ్లలో చోరీలకు పాల్పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ సూచించారు. పండుగకు ఊళ్లకు వెళ్లేవారు తమ ఇళ్ల భద్రత విషయంలో ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. జిల్లా పరిధిలో చోరీల నియంత్రణకు పోలీసు శాఖ తరఫున అన్ని అవసరమైన చర్యలు చేపడుతున్నామని, రాత్రి వేళల్లో పోలీసు గస్తీని ముమ్మరం చేసినట్లు ఎస్పీ తెలిపారు. ప్రజల్లో అవగాహన కల్పిస్తూ అప్రమత్తం చేస్తున్నామని పేర్కొన్నారు. తమ పరిసరాల్లో...