స్వర్ణకారుల షాపుల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి

జగిత్యాల జిల్లా, అక్టోబర్ 13 ( సమాజహితం న్యూస్ ) : స్వర్ణకారులు, బంగారు ఆభరణాల వ్యాపారులు తమ షాపుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని మెట్ పల్లి సీఐ సూచించారు. బంగారు ఆభరణాల దుకాణాల్లో చోరీలు, ఇతర అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. షాపుల వద్ద అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేసుకోవడంతో పాటు సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. దుకాణాల్లో నాణ్యమైన సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, అవి నిరంతరం పనిచేసేలా చూసుకోవాలని పేర్కొన్నారు. షాపులను మూసివేసే సమయంలో బంగారు ఆభరణాలను సురక్షితమైన లాకర్లలో భద్రపరచాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నగదు, విలువైన ఆభరణాలను...