
ఇటీవలే మరణించిన బీటెక్ విద్యార్థి అంకం రాహుల్ కుటుంబానికి ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్ పరామర్శ. కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామానికి చెందిన ఇటీవల మరణించిన బీటెక్ విద్యార్థి అంకం రాహుల్ కుటుంబ సభ్యులను కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఈరోజు వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు.
రాహుల్ మృతితో తీవ్ర విషాదంలో ఉన్న కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా కుటుంబానికి తక్షణ సహాయంగా రూ.25,000 ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే అందజేశారు. అలాగే రాహుల్ సోదరి విద్యాభ్యాసానికి సంబంధించిన పూర్తి బాధ్యతను తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఆమె చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా కల్పించారు. రాహుల్ కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలను అందించేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు.