Loading Time...
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
News App యాప్ ద్వారా సులభంగా వార్తలు చదవండి

జగిత్యాలలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట భద్రత.. 700 మంది పోలీసులతో బందోబస్తు!

Author SAMAJA HITHAM | 23 Sep 2026, 06:54 PM | జగిత్యాల
జగిత్యాలలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట భద్రత.. 700 మంది పోలీసులతో బందోబస్తు!

జగిత్యాల జిల్లా, సెప్టెంబర్ 23 (సమాజహితం): గణేష్ నిమజ్జనానికి జగిత్యాల జిల్లా పోలీస్ యంత్రాంగం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది. జిల్లా వ్యాప్తంగా సుమారు 3,500 గణనాథుల నిమజ్జనం నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా జరిగేలా సుమారు 700 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో పాటు వివిధ శాఖల అధికారులు, ట్రాన్స్‌జెండర్ లు, ఎన్‌సీసీ విద్యార్థులు, శిక్షణలో ఉన్న కానిస్టేబుల్ అభ్యర్థులను కూడా భద్రతా విధుల్లో సమన్వయం చేస్తున్నారు. ప్రధాన నిమజ్జన ప్రాంతాలు, రహదారులు, కూడళ్ల వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణ, భక్తుల భద్రత, నిమజ్జన ప్రక్రియను పర్యవేక్షించేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. భక్తులు, ప్రజలు పోలీసులకు సహకరిస్తూ నిమజ్జన వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.