Loading Time...
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
News App యాప్ ద్వారా సులభంగా వార్తలు చదవండి

జర్నలిస్టు జనానికి అంకితం..కుటుంబానికి దూరం..25 ఏళ్ల జర్నలిజం ప్రస్థానం..నేడు ఆసుపత్రి పాలైన సీనియర్ జర్నలిస్టు!

Author SAMAJA HITHAM | 26 Sep 2026, 03:10 PM |
జర్నలిస్టు జనానికి అంకితం..కుటుంబానికి దూరం..25 ఏళ్ల జర్నలిజం ప్రస్థానం..నేడు ఆసుపత్రి పాలైన సీనియర్ జర్నలిస్టు!

జర్నలిస్టు జనానికి అంకితం..కుటుంబానికి దూరం..25 ఏళ్ల జర్నలిజం ప్రస్థానం..నేడు ఆసుపత్రి పాలైన సీనియర్ జర్నలిస్టు..జనం కోసం కలం పట్టాడు..నేడు కుటుంబం కోసం చేయూత కోరుతున్నాడు..నేడు ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు..!

జగిత్యాల జిల్లా: జనం సమస్యలను తన సమస్యలుగా భావిస్తూ.. ప్రజల గొంతుకగా నిలుస్తూ.. గత 25 ఏళ్లుగా జర్నలిజం వృత్తినే నమ్ముకుని ముందుకు సాగుతున్న సీనియర్ జర్నలిస్టు గాజుల నాగరాజు నేడు ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జర్నలిస్టుల కోసం పనిచేస్తూ.. పలు కీలక పదవుల్లో కొనసాగిన నాగరాజు, జగిత్యాల జిల్లా ఏర్పడిన తర్వాత కూడా జిల్లా స్థాయిలో బాధ్యతలు నిర్వహించారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో, ముఖ్యంగా అక్రిడిటేషన్లు, బస్ పాసులు తదితర అంశాల్లో ఎంతోమందికి సహాయం అందించారు. ప్రతి జర్నలిస్టును "అన్నా" అంటూ ఆప్యాయంగా పలకరించే నాగరాజు.. తన జీవితంలో ఎక్కువ భాగాన్ని జర్నలిజానికే అంకితం చేశారు. అయితే.. జర్నలిజాన్నే నమ్ముకుని జీవించిన ఆయన కుటుంబం మాత్రం ప్రస్తుతం తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. సొంత ఇల్లు లేదు.. భూమి లేదు.. ఆర్థికంగా వెనుకబడి ఉన్న పరిస్థితుల్లో భార్య, ఇద్దరు ఆడపిల్లల బాధ్యతలను మోస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చారు. ఇటీవల నాగరాజు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డారు. తొలుత జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించగా.. మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతరం కరీంనగర్‌లోని చల్మడ ఆనందరావు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

ప్రస్తుతం నాగరాజు చికిత్స కోసం రోజుకు వేల రూపాయలు ఖర్చవుతున్నాయి. ఇప్పటికే కుటుంబంపై అప్పులు ఉన్నాయి. మరోవైపు ఇంటి అద్దె, నిత్యావసరాలు, పిల్లల చదువులు, వైద్య ఖర్చులు.. ఇలా కుటుంబంపై ఆర్థిక భారం మరింత పెరిగింది. నాగరాజు భార్య బీడీలు చుడుతూ రోజుకు వచ్చే కొద్దిపాటి ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. ఒకవైపు భర్త ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. మరోవైపు ఇద్దరు ఆడపిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందోనని ఆ కుటుంబం ఆందోళన చెందుతోంది. జర్నలిజం కుటుంబంలో మనలో ఒకరిగా ఉన్న నాగరాజు కుటుంబం ప్రస్తుతం మన అందరి సహాయాన్ని ఆశిస్తోంది. జగిత్యాల పట్టణ ప్రెస్ క్లబ్ సభ్యులు ఇప్పటికే తమ వంతుగా కొంత ఆర్థిక సహాయం అందించారు. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న వైద్య ఖర్చులకు ఆ సహాయం సరిపోవడం లేదు. కాబట్టి జగిత్యాల జిల్లాలోని ప్రతి జర్నలిస్టు.. నాగరాజు కుటుంబ పరిస్థితిని తమ కుటుంబ సమస్యగా భావించి, తమకు చేతనైనంత ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి. మన చిన్న సహాయం.. ఆ కుటుంబానికి పెద్ద భరోసా కావచ్చు. మన చేయూత.. ఇద్దరు ఆడపిల్లల భవిష్యత్తుకు ఒక ఆశాకిరణం కావచ్చు. జర్నలిస్టుల కోసం ఎన్నో సందర్భాల్లో ముందుండి పనిచేసిన గాజుల నాగరాజుకు.. ఈ కష్ట సమయంలో జర్నలిస్టు సమాజం అండగా నిలవాల్సిన సమయం ఇది. ఆపదలో ఉన్న సహచర జర్నలిస్టు కుటుంబానికి మన వంతు చేయూత అందిద్దాం.. ఆ కుటుంబంలో మళ్లీ ఆశలు నింపుదాం.

ఇవి కూడా చదవండి