Loading Time...
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
News App యాప్ ద్వారా సులభంగా వార్తలు చదవండి

వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం

Author SAMAJA HITHAM | 26 Sep 2026, 05:13 PM | హైదరాబాద్
వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం

వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం

హైదరాబాద్, సెప్టెంబర్ 26 (సమాజహితం): తెలంగాణ వీరనారి చిట్యాల (చాకలి) ఐలమ్మ 131వ జయంతి సందర్భంగా రజక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ లోయర్ ట్యాంక్‌బండ్‌లో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు వీరనారి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ శ్రీమతి సూరేపల్లి నంద, జస్టిస్ నందికొండ నర్సింగరావు, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐలమ్మ చేసిన పోరాటాన్ని, ఆమె చూపిన ధైర్యసాహసాలను స్మరించుకున్నారు. సామాజిక న్యాయం, వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవం కోసం సాగుతున్న ప్రజా జీవిత ప్రయాణంలో చాకలి ఐలమ్మ పోరాటం ఎప్పటికీ ప్రత్యేకమైన స్ఫూర్తినిస్తుందని కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు పేర్కొన్నారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఐలమ్మ అణచివేతకు ఎదురొడ్డి నిలిచి, తన హక్కుల కోసం పోరాడిన తీరు తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు.

ఐలమ్మ ధైర్యం, తెగువ, ఆత్మగౌరవం తెలంగాణ మట్టిలోని పోరాట స్ఫూర్తికి ప్రతీకగా నిలిచాయని పేర్కొన్నారు. సామాజిక సమానత్వం, హక్కులు, ఆత్మగౌరవం కోసం ఆమె చేసిన పోరాటాన్ని నేటి తరాలు స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. వీరనారి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమెకు ఘన నివాళులు అర్పిస్తూ, ఆమె చూపిన ధైర్యం, ఆత్మగౌరవం, పోరాట మార్గాన్ని మరోసారి స్మరించుకున్నారు. తెలంగాణ ప్రజల హక్కుల కోసం పోరాడిన మహనీయురాలిగా ఐలమ్మ సేవలను కొనియాడారు. వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తికి శతకోటి వందనాలు అర్పించారు.

ఇవి కూడా చదవండి