Loading Time...
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
News App యాప్ ద్వారా సులభంగా వార్తలు చదవండి

గాంధీ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు!

Author SAMAJA HITHAM | 02 Oct 2026, 07:46 PM | జగిత్యాల
గాంధీ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు!

బండలింగాపూర్, జగిత్యాల జిల్లా (సమాజహితం న్యూస్): జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని బండలింగాపూర్ గ్రామంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు, గ్రామ ప్రజలు మహాత్మా గాంధీ దేశ స్వాతంత్ర్యోద్యమానికి అందించిన సేవలను స్మరించుకున్నారు. అహింస, సత్యాగ్రహ మార్గాల ద్వారా స్వాతంత్ర్య సాధన కోసం గాంధీజీ చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కనగందుల లక్ష్మి-సంజీవ్, ఉపసర్పంచ్ ఆకుల రాకేష్ పటేల్ తో పాటు గ్రామ ప్రజలు, పలువురు నాయకులు తదితరులు పాల్గొని మహాత్మా గాంధీకి ఘనంగా నివాళులు అర్పించారు.