Loading Time...
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
News App యాప్ ద్వారా సులభంగా వార్తలు చదవండి

అహింసతోనే అఖండ భారతావనికి స్వాతంత్ర్యం తెచ్చిన మహనీయుడు గాంధీజీ: జిల్లాఎస్పీ అశోక్ కుమార్

Author SAMAJA HITHAM | 02 Oct 2026, 10:42 PM | జగిత్యాల
అహింసతోనే అఖండ భారతావనికి స్వాతంత్ర్యం తెచ్చిన మహనీయుడు గాంధీజీ: జిల్లాఎస్పీ అశోక్ కుమార్

జగిత్యాల జిల్లా, అక్టోబర్ 2 (సమాజహితం న్యూస్): అహింసతోనే అఖండ భారతావనికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన మహనీయుడు మహాత్మా గాంధీజీ అని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ అన్నారు. మహాత్మా గాంధీ జయంతి వేడుకలను జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, మాట్లాడారు.. గాంధీజీ సూచించిన శాంతి, అహింస, సత్యం మార్గంలో ముందుకు సాగాలని, గాంధీ సన్మార్గంలో ప్రయాణిస్తూ నమ్మిన సిద్ధాంతాలను, విలువలను నిబద్ధతతో ఆచరించడం వల్ల ఆయన కీర్తి ప్రతిష్ఠలు విశ్వవ్యాప్తం అయ్యాయని, స్వాతంత్ర్యం కోసం గాంధీజీ చేసిన సేవలు మరువలేనివని తెలిపారు. భారతావనికి స్వేచ్ఛా స్వాతంత్ర్యం అందించడం కోసం ఆయన ఎంచుకున్న శాంతి, అహింస మార్గం భారతీయులకే కాదు యావత్ ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచిందని, దేశ అభివృద్ధి కోసం నిస్వార్థంగా సేవలు అందించాలన్నారు. ఆయన ఆశయాల సాధనకు కృషి చేయాలని, గాంధీజీ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఆయన ఆశయాలను కొనసాగించడమే ఆయనకు ఇచ్చే ఘన నివాళి అని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ ఆరిఫ్ అలీ ఖాన్, ఆర్‌ఐ లు వేణు, సైదులు, ఆర్‌ ఎస్‌ఐ లు, జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.