Loading Time...
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
News App యాప్ ద్వారా సులభంగా వార్తలు చదవండి

మెట్‌పల్లి, కోరుట్ల ఆర్టీసీ డిపోలలో ఐక్య కూటమి ఎన్నికల ప్రచారం!

Author SAMAJA HITHAM | 03 Oct 2026, 07:46 PM | జగిత్యాల
మెట్‌పల్లి, కోరుట్ల ఆర్టీసీ డిపోలలో ఐక్య కూటమి ఎన్నికల ప్రచారం!

మెట్‌పల్లి, అక్టోబర్ 03 ( సమాజహితం న్యూస్ ) : ఈ నెల 9వ తేదీన జరగనున్న TGSRTC ఎన్నికల నేపథ్యంలో ఆర్టీసీ ఐక్య కూటమి సంఘాల ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా మెట్‌పల్లి, కోరుట్ల ఆర్టీసీ డిపోల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డిపోల్లో పనిచేస్తున్న సిబ్బందిని ముఖాముఖిగా కలిసి కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారం చేపట్టారు. ఆర్టీసీ ఐక్య కూటమి సంఘాల చైర్మన్ ఈర్ల వెంకటేశ్వర్లు, కొమురయ్య, మౌలానా, సత్యపాల్ తదితరులతో కలిసి తెలంగాణ రాష్ట్ర ఏఐటీయూసీ కౌన్సిల్ మెంబర్, జగిత్యాల జిల్లా ఏఐటీయూసీ అధ్యక్షుడు ఏశమేని గణేష్ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మికుల సమస్యలు, హక్కులు, సంక్షేమం తదితర అంశాలపై సిబ్బందితో చర్చించారు. ఎన్నికల్లో ఐక్య కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కార్మికులను కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో డిపో నాయకులు బీడీ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి సుతారి రాములు, మున్సిపల్ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి ఎండి ఉస్మాన్, ఖాతా వినయ్, చౌదరి శివకుమార్, ఓడల రాకేష్, మాతంగి శ్రావణ్, మరంపల్లి రాజశేఖర్, వహీద్, భోజ సంపత్, నక్క కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.

మెట్‌పల్లి, కోరుట్ల ఆర్టీసీ డిపోలలో ఐక్య కూటమి ఎన్నికల ప్రచారం! - Additional Imageమెట్‌పల్లి, కోరుట్ల ఆర్టీసీ డిపోలలో ఐక్య కూటమి ఎన్నికల ప్రచారం! - Additional Image