Loading Time...
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
News App యాప్ ద్వారా సులభంగా వార్తలు చదవండి

విద్యుత్ శాఖ ఉద్యోగి కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గాజెంగి నందయ్య

Author SAMAJA HITHAM | 07 Oct 2026, 10:45 PM | జగిత్యాల
విద్యుత్ శాఖ ఉద్యోగి కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గాజెంగి నందయ్య


జగిత్యాల/ మెట్ పల్లి, అక్టోబర్ 7 ( సమాజహితం ప్రతినిధి): రోడ్డు ప్రమాదంలో ఇటీవల మృతి చెందిన విద్యుత్ శాఖ ఉద్యోగి బోయినిపల్లి అశోక్ కుటుంబాన్ని బుధవారం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గాజెంగి నందయ్య పరామర్శించారు. మెట్ పల్లి మండలంలోని బండలింగాపూర్ గ్రామంలోని వారి నివాసానికి వెళ్లి అశోక్ చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. చిన్న వయసులోనే అశోక్ మృతి చెందడం బాధాకరమన్నారు. అశోక్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం వచ్చే విధంగా కృషి చేస్తామని పేర్కొన్నారు.