Loading Time...
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
News App యాప్ ద్వారా సులభంగా వార్తలు చదవండి

కోరుట్ల వినాయక నిమజ్జన వాగు వద్ద ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ

Author SAMAJA HITHAM | 19 Sep 2026, 09:47 PM | జగిత్యాల
కోరుట్ల వినాయక నిమజ్జన వాగు వద్ద ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ

జగిత్యాల/ కోరుట్ల, సెప్టెంబర్ 19 (సమాజహితం ప్రతినిధి) : భక్తి శ్రద్ధలతో కోరుట్ల పట్టణంలో ఈ నెల 23, 24 తేదీలలో వినాయక నిమజ్జన వేడుకలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తెలిపారు. కోరుట్ల పట్టణంలోని వాగు వద్ద వినాయక నిమజ్జన వేడుకల కోసం మున్సిపల్, పోలీస్, రెవెన్యూ, అగ్నిమాపక ఇతర శాఖల ఆధ్వర్యంలో చేస్తున్న ఏర్పాట్లను శనివారం జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. వినాయక మండపాల నిర్వాహకులు తమ విగ్రహాలను భక్తి శ్రద్ధల మధ్య వేడుకలు నిర్వహిస్తూ వైభవంగా తరలించాలని సూచించారు. ప్రతి ఒక్క నిర్వాహకులు అధికారులకు పూర్తి స్థాయిలో సహకరించాలని, ఎటువంటి సంఘటనలు జరగకుండా శోభయాత్ర, నిమజ్జన వేడుకలు చేసుకోవాలని కోరారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పక్కా ప్రణాళికతో వేడుకలను విజయవంతం చేయాలని ఆదేశించారు. వినాయక నిమజ్జనానికి కావలసిన స్టేజ్, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని, వైద్య సేవలు, అగ్నిమాపక శాఖ, మత్స్యశాఖ అధికారులు సేవలు అందించాలని, నిమజ్జన ప్రదేశాల్లో పారిశుద్ధ్య పనులు చేయించాలని, భారీ క్రేన్లు, చిన్న క్రేన్లు, గజ ఈతగాళ్లు అవసరం మేరకు అందుబాటులో ఉంచుకోవాలని, అవసరమైతే అదనంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. పట్టణ వాసులతో పాటు భక్తులు, పిల్లలు తరలివచ్చే అవకాశం ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. నిమజ్జన వేడుకలు భక్తులందరూ భక్తి శ్రద్ధలతో శాంతియుత వాతావరణంలో చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఈ పరిశీలనలో కోరుట్ల ఆర్డీవో జీవాకర్ రెడ్డి, మెట్ పల్లి డిఎస్పీ రాములు, కోరుట్ల మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్, సంబంధిత అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.