Loading Time...
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
News App యాప్ ద్వారా సులభంగా వార్తలు చదవండి

కోరుట్ల పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Author SAMAJA HITHAM | 19 Sep 2026, 09:52 PM | జగిత్యాల
కోరుట్ల పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

జగిత్యాల/ కోరుట్ల, సెప్టెంబర్ 19 (సమాజహితం ప్రతినిధి) : జిల్లాలోని పోలీస్ స్టేషన్ల పనితీరు, నేరాల దర్యాప్తు పురోగతి, ప్రజలకు అందిస్తున్న సేవలను పరిశీలించే క్రమంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ శనివారం కోరుట్ల పట్టణంలోని పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిధిలో నమోదైన కేసుల వివరాలు, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతి, స్టేషన్ రికార్డుల నిర్వహణ, బీట్ వ్యవస్థ అమలు, రౌడీషీటర్లు మరియు నేరస్తులపై నిఘా అంశాలను సమీక్షించారు. స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, ప్రజలకు అందిస్తున్న సేవలపై ప్రత్యేకంగా ఆరా తీశారు. ప్రస్తుతం జరుగుతున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పోలీస్ అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ సూచించారు. గణేష్ మండపాల వద్ద భద్రతా చర్యలను నిరంతరం పర్యవేక్షించాలని, మండపాల నిర్వాహకులతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశించారు. గణేష్ విగ్రహాల ఊరేగింపు మార్గాలను ముందుగానే పరిశీలించి ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా నేరాల నియంత్రణలో భాగంగా విజిబుల్ పోలీసింగ్ కు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలపై నిఘా ఉంచాలన్నారు. పాత నేరస్తుల కదలికలను గమనిస్తూ ముందస్తు చర్యలు చేపట్టాలని, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. రాత్రి వేళల్లో పెట్రోలింగ్ ను మరింత ముమ్మరం చేసి చోరీలు, గంజాయి అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలపై కఠిన నిఘా కొనసాగించాలని, ముఖ్యంగా యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. ఎస్పీ వెంట కోరుట్ల సీఐ లక్ష్మీనారాయణ, ఎస్ఐ శ్యామ్ రాజ్ ఉన్నారు.