Loading Time...
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
News App యాప్ ద్వారా సులభంగా వార్తలు చదవండి

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నేటితో ముగింపు

Author SAMAJA HITHAM | 23 Sep 2026, 01:54 PM | Array
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నేటితో ముగింపు


- తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నేటితో ముగింపు
- తిరుమలలో ఘనంగా కొనసాగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
- నేడు బ్రహ్మోత్సవాల్లో అత్యంత పవిత్రమైన చక్రస్నానం
- గోవింద నామస్మరణతో మార్మోగుతున్న తిరుమల కొండలు

తిరుమల, సెప్టెంబర్ 23 (సమాజహితం): తిరుమలలో అత్యంత వైభవంగా కొనసాగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నేటితో ముగియనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో అత్యంత పవిత్రమైన ఘట్టంగా భావించే చక్రస్నానం నేడు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. వరాహస్వామి పుష్కరిణిలో శ్రీమలయప్ప స్వామి, శ్రీదేవి, భూదేవి సమేతంగా సుదర్శన చక్రాన్ని ఊరేగింపుగా తీసుకువచ్చి పవిత్ర స్నానం నిర్వహించనున్నారు. అనంతరం సుదర్శన చక్రానికి శాస్త్రోక్తంగా అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేపట్టనున్నారు.

చక్రస్నానం అనంతరం భక్తులు కూడా వరాహస్వామి పుష్కరిణిలో పవిత్ర స్నానం ఆచరించనున్నారు. ఈ పవిత్ర ఘట్టాన్ని దర్శించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివచ్చారు. దీంతో తిరుమల కొండలు గోవింద నామస్మరణతో మార్మోగుతున్నాయి. భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శనం, రవాణా, తాగునీరు, అన్నప్రసాదం తదితర సౌకర్యాలను అందుబాటులో ఉంచడంతో పాటు భద్రతపై ప్రత్యేక దృష్టి సారించింది. చక్రస్నానం ఘట్టంతో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు చేరుకోనున్నాయి. భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుంటూ గోవింద నామస్మరణలో మునిగిపోయారు.

ఇవి కూడా చదవండి